మేడారం జాతర అధికారిక వెబ్సైట్ ప్రారంభం-2022
మేడారం జాతర గురించి పలు వెబ్సైట్లు తప్పడు సమాచారం ఇస్తున్నాయని ఆదివాసీ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సమాచారం అందించడం కోసం అధికారికంగా ఓ వెబ్సైట్ను ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ప్రారంభించారు.
మేడారం జాతర గురించి ఆదివాసీ పూజారులు అధికారికంగా www.medaramtemple.com వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. ఆ వెబ్సైట్ను ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. మేడారం గురించి వివిధ వెబ్సైట్లలో తప్పుడు సమాచారం ఉంటుందని, ఆ సమగ్ర సమాచారం అర్ధ సత్యాలతో కూడినదని ఆదివాసి పూజారులు తెలిపారు.
ఆ పరిస్థితికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ను ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరకు సంబంధించిన సమాచారం అందులో ఉంచుతామని ఆదివాసి ప్రధాన పూజారి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. పూజారుల సంఘం తరుపున మెరుగైన సమాచారం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
మేడారం జాతర గురించి ఆదివాసీ పూజారులు అధికారికంగా వెబ్సైట్
PUJARULA SANGHAMteam
Our strength lies in our individuality. Set up by Esther Bryce, the team strives to bring in the best talent in various fields, from architecture to interior design and sales.