let'S u know about medaram jatara
history of sammakka
శ్రీమేడారం సమ్మక్క- సారలమ్మ చరిత్ర
శ్రీ మేడారం సమ్మక్క - సారలమ్మ చరిత్ర
(క్రీ.శ. 1260-1328 సంవత్సరాల మధ్య కాలంలో ఓరుగల్లు రాజధానిగా
పరిపాలించిన కాకతీయ (ప్రతాపరుద్ర దేవుడిపై స్వతంత్ర పోరాటం జరిపి అసువులు బాసిన
శ్రీ మేడారం సమ్మక్క - సారలమ్మ, పగిడిద్ద రాజు - జంపన్నల భక్తి, విప్లవ, విరోచిత,
పోరాట అమరగాథ.
మేడారం భీకర అరణ్యం
అది రవి కిరణాలు సోకని మేడారం కీకారణ్యం. ఒకరోజు 10 మంది కోయదొరలు
తమ వేట ఆయుధాలతో ఆ అడవిలో ఒక అడవి పందిని తరుముకుంటూ వస్తున్నారు !
కాని అది వారు చూస్తున్నంతలోనే ఎలాగో తప్పించుకుంది. అయినా వారు నిరాశపడలేదు!
దాన్న ఎలాగైనా పట్టుకోవాలన్న పట్టుదల వారిలో హెచ్చింది !
“ ఆ అడివి పంది తప్పిచ్చుకున్నాగని దాన్నిడిషి పెట్టి ఎల్లేది లేదు ! అడివంత
గాలించాలే ! ఎట్లాగైనా దాన్న ఏటాడాలే !” అన్నాడు వాళ్ళ నాయకుడు నాగన్నదొర.
“ అవును ! కనిపిచ్చిన జంతువును యిడిశి పెట్టిఎల్లటం మన కోయజాతికే
అవమానం” మరింత పట్టుదలగా అన్నాడు మరో కోయదొర వీరన్నదొర.
“అయితే మిోరందరు ఎళ్ళి తలోదిక్కున ఎతుకుండ్తి” అంటూ అన్ని వైపులా
ఆదొరలను పంపించాడు నాగన్నదొర. ఆ అడవి పందిని కనిపెట్టడానికి తానూ అక్కడ వున్న
పెద్ద మడ్డి వృక్షాన్ని ఎక్కాడు. అంతా కలియజూశాడు !
పులుల మధ్యలో అద్భుతపాప
ఆశ్చర్యం! అల్లంత దూరాన చిన్న మైదానంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక
పొప చుట్టూ కొన్ని పెద్ద పులులు భక్తి భావంతో తలలు వంచి ప్రదక్షిణ చేస్తూ కనిపించాయి
నాగన్నదొర తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. మరీ మరీ చూశాడు. అదే దృశ్యం!
(భ్రమను కాడు ! అది యదార్థమని నిర్ధారించుకున్నాడు. “తల్లీ కొండ దేవతా! మామేడారాన్ని
కాపాడేతందుకు అవతారమెత్తినావా!” తన్మయత్వంతో అంటూ రెండు చేతులు జోడించి
._నమన్మరించాడు. జాగు చేయకుండా ఈవిషయం తన వాళ్ళందరికి వెంటనే
.. తైలుపాలనుకున్నాడు! “ఓవో!...వో!.. వీరన్నదొరా!... మవోంకాళయ్య
గ్గన్నదొరా!... బిరాన లగెత్తుకు రాండ్లహో!” కేక వేసి పిలిచాడు. కేక విని దొరలంతా
ఏన వేగీరంగా వచ్చారు! “పంది జాడ దొరికిందా?” అంటూ ఎంతో ఆశగా
People and culture
ఇంతింతై.. విశ్వవ్యాప్తమై..
చిన్న పండగగా ప్రారంభమై... మహా జాతరగా ఆవిర్భావం
ఇంతింతై...వటుడింతై అన్న చందంగా బయ్యక్కపేటలో పండగలా ప్రారంభమై నేడు మేడారం మహా జాతరగా విశ్వవ్యాప్తమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచింది. కోట్లాది మంది భక్తజనుల కొంగుబంగారమైంది.. వన్యమృగాల బారి నుంచి తప్పించుకొని ఎలా మొక్కులు తీర్చుకుంటామో అని చింతపడే స్థాయి నుంచి అత్యాధునిక వైఫై సేవలు, అన్ని హంగులతో విశేషంగా ఆకర్షిస్తోంది.. వనం కాస్త జనారణ్యంగా మారి.. వచ్చిన వారికి సకల సౌకర్యాలు కల్పిస్తోంది.. జాతరకు రారమ్మని ఆహ్వానిస్తోంది.
న్యూస్‌టుడే, ఏటూరునాగారం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జాతరలో ప్రధాన భాగస్వామ్యం పంచుకుంటున్నారు. వీరికి తోడు ఈశాన్య రాష్ట్రాల నుంచి సైతం వస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా తదితర దేశాల నుంచి వచ్చి అమ్మల దీవెనలు తీసుకుంటున్నారు. ఉపాధి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు, వారి ద్వారా మేడారం మహత్యం, కోటి మంది భక్తులు ఒకే చోట కలిసుంటే భావనతో చూడాలనే ఆసక్తి విదేశీయుల్లోనూ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ జాతరల్లోనూ కనిపించని సంబరం మేడారంలో గోచరిస్తుంది. ఇంతటి సంబరాన్ని సామాజిక మాధ్యమాల, అంతర్జాలం ద్వారా తెలుసుకున్న విదేశీయులు సైతం మేడారం సమ్మేళనాన్ని తిలకించేందుకు వస్తున్నారంటే ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతింతై..జగమంతై ఆసియాలోనే అతి పెద్ద జాతరగా ఆవిర్భవించింది. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిధులు కేటాయించడం, భక్తజనులకు సకల సౌకర్యాలు కల్పించడంతో గొప్ప పురోభివృద్ధిని సాధించింది.
పన్నెండో శతాబ్దంలోనే ఆరంభం
మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను పన్నెండో శతాబ్దంలోనే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ప్రారంభించినట్లు కోయ పెద్దలు చెబుతున్నారు. మొదట్లో మేడారానికి సమీపంలోని బయ్యక్కపేట కుగ్రామంలో జాతర జరిగేది. అప్పటి గ్రామ స్థితిగతుల కారణంగా, కోయలకు ఉత్సవం జరిపే ఆర్థిక స్థోమత లేనందున చందా వంశీయులు భూపతయ్య, జోగయ్య, రామన్న మధ్యన తలెత్తిన గొడవ కారణంగా జాతర ఆగిపోయిందట. 1944 జనవరి 6న అప్పటి తహసీల్దార్ బయ్యక్కపేటలో జాతర నిర్వహణకు కమిటీని నియమించారు. అయినా స్థానిక పెద్దలు జాతర నిర్వహించలేకపోయారు. చివరికి మేడారం పూజారులైన వడ్డెలకు అప్పగించారు. 1946లో జాతరను మేడారంలో నిర్వహించారు. అప్పుడు రూ.17,173 ఆదాయమొచ్చింది. ఆ సమయంలో రాష్ట్రంలోని ఇతర ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు కూడా వచ్చినట్లుగా పెద్దలు చెప్పారు.
1962 నుంచి మేడారంగా..
1962 సంవత్సరంలో సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్ఠించారు. అప్పటికి ఆ ప్రాంతమంతా కీకారణ్యంగా ఉండేది. భక్తులకు రవాణా సౌకర్యాలుండేవి కావు. ఎడ్లబండ్లు కట్టుకుని తరలివచ్చేవారు. మార్గమధ్యలో అడవి మృగాలు ఎదురువచ్చేవి. భక్తుల జోలికి రాకుండా వెనుదిరిగి పోయేవట. అమ్మవారి మహిమతో ఏ ఒక్కరికీ ఎలాంటి ఆపద జరగడం లేదని భక్తుల నమ్మకం. నాటి గ్రామ జనాభా 143. అందులో 121 మంది కోయవారుండగా మిగతా 22 మంది ఇతరులు. భక్తులంతా వారి గుడిసెల చుట్టూ విడిది చేసేవారు. అనంతరం 1968 నుంచి జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పడు ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ములుగుకు చెందిన సంతోష్ చక్రవర్తి నియమితులయ్యారు. అప్పుడే ఎంపల్లి ఎల్లారయ్య, కాక నర్సయ్య, చందా బాబూరావు, సిద్దబోయిన మునీందర్, సిద్దబోయిన లక్ష్మణ్‌రావు పూజారులుగా నియామకమయ్యారు.
రాష్ట్ర పండగగా ఆవిర్భావం
1980 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ బాపురెడ్డి చొరవతో మేడారం జాతర విశేషమైన ప్రాచుర్యం పొందింది. దాంతో జాతర ఆదాయం రికార్డు స్థాయిలో రూ.4.50 లక్షలకు చేరింది. ఆ తర్వాత 1996 ఫిబ్రవరి 2న అప్పటి కలెక్టర్ అజయ్‌మిశ్రా జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించారు. 1998లో అప్పటి కలెక్టర్ శాలినీమిశ్రా మేడారంలో రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయగా శాశ్వత నిర్మాణాలు చేపట్టి, దేవాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదించినట్లుగా ఆదివాసీ పెద్దలు చెప్పారు.
ఏడాది పొడవునా భక్తుల రాక
గతంలో జాతర సమయంలో మాత్రమే భక్తులు వచ్చి దేవతలకు మొక్కులు అప్పగించుకుని వెళ్లే వారు. ప్రస్తుతం జాతర తీరు మారింది. ఏడాది పొడవునా వచ్చి మొక్కులు అప్పగిస్తూనే ఉన్నారు. పెరిగిన వసతులు, రవాణా సౌకర్యాలతో దేశం నలు మూలల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా వస్తున్నారు. కొన్ని సంవత్సరాల కింద జాతర సమీపిస్తుండగా నెల రోజుల ముందు నుంచి భక్తులు వచ్చి వెళ్లేవారు. ఇప్పుడు 365 రోజులూ మేడారం రద్దీగా ఉంటుంది. అమ్మలను దర్శించుకుని, మొక్కులు అప్పగించుకుని వెళ్తూనే ఉన్నారు. ఇలా జాతర దినదిన పురోభివృద్ధిని సాధిస్తూ ఆ చల్లని తల్లుల చలువతో విశ్వవ్యాప్తమైంది.
పెరిగిన రవాణా సౌకర్యాలు
జాతర మొదట్లో ఎడ్లబండ్లే ప్రధానమైన రవాణా సౌకర్యంగా ఉండేవి. అప్పటి జిల్లా కేంద్రం వరంగల్‌కు 110 కిలో మీటర్ల దూరంలోని మేడారానికి ఆర్టీసీ సంస్థ 1970వ దశకంలో బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అప్పుడు బస్సులు కొద్ది మొత్తంలో నడిచేవి. బస్సుల్లో ధనికులైనవారే వెళ్లేవారు. కాలక్రమేణా రవాణా వసతులు పెరిగాయి. రోడ్డు సౌకర్యాలు మెరుగయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. క్రమంగా ఎడ్లబండ్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2018 జాతరకు 4200 బస్సులు ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసింది. లక్షల సంఖ్యలో కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలు వచ్చి వెళ్తున్నాయి. 2010 సంవత్సరం నుంచి ప్రభుత్వం హెలీకాప్టర్ సౌకర్యం కూడా కల్పించింది. రైలు మార్గం మినహా అన్ని రకాల రవాణా సౌకర్యాలు ముమ్మరంగా పెరిగాయి. ఇలా ఎడ్లబండ్ల స్థాయి నుంచి హెలికాప్టర్ వరకు మేడారం జాతర దినదిన ప్రవర్థమానమవుతోంది.
మేడారం జాతరలో బెల్లాన్ని బంగారంగా భావిస్తారు... ఎందుకో తెలుసా...
మన దేశంలో బంగారానికి ఎంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలోని మేడారం జాతరలో మాత్రం పసిడి అంటే రుచి.. పచి లేని అలోహ ముద్ద కాదు.. మనందరం తినే బెల్లం. అందుకే మేడారంలో సమ్మక్క, సారలక్క జాతరకు వెళ్లే భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బెల్లాన్ని తీసుకెళతారు.అదే బెల్లంతో అమ్మవార్లను కొలుస్తారు.. తలుస్తారు.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరంలో టన్నుల కొద్దీ బెల్లం అమ్మవార్లకు సమర్పించబడుతుంది. అయితే ఈ మేడారం జాతరలో బెల్లాన్నే ఎందుకు సమర్పిస్తారు? ఇక్కడు బెల్లానికి బంగారం లాంటి ప్రాధాన్యత ఎలా వచ్చింది అనే విశేషాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...
Write your text here...
ఆదివాసీల ఆచారం.. మామూలుగా మనలో చాలా మంది దేవుళ్లందరికీ అనేక రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాయి. అయితే అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీల ఆచారాలు మాత్రం మనందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో సమ్మక్క, సారలక్కకు భక్తులందరూ బెల్లాన్ని బంగారంగా భావించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.
బెల్లంతో పాటు.. వడి బాల బియ్యం, చీర, పసుపు బట్టలు, తట్టెలు, కొబ్బరికాయలు, బుట్టలు, బోనాలు, పట్నాలు, చిలకలు, ఎదురుకోళ్లు.. యాట పోతుల వాటిని కూడా మొక్కులుగా చెల్లించుకుంటారు.
ఉప్పు, బెల్లం చాలా విలువైనవి.. ఆదివాసీలకు బెల్లం, ఉప్పు అంటే ఇష్టం. ఎందుకంటే ఇవి ఇతర ప్రాంతాల నుండి వారి దగ్గరికి వస్తాయి. అందుకే వారు వీటికి ఎక్కువ విలువ ఇస్తారు.
సంతానం విషయంలో.. ముఖ్యంగా చాలా మంది మహిళలు తమకు సంతానం కలిగినా.. సంతానం కలగాలన్నా.. తమ బరువును అంతా ఈ బెల్లంగా రూపంలో చెల్లించుకునేందుకు ఈ జాతరకు వస్తారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు తమ కోరికలను నెరవేరుతాయని కొందరు.. మరి కొందరు తమ కోరికలు నెరవేరినందుకు ఈ మొక్కులను తీరుస్తారు.
బరువును బట్టి బెల్లం.. ఇక్కడి అమ్మవార్లకు తమ పిల్లల బరువును బట్టి బెల్లాన్ని సమర్పిస్తున్నారంట. ముఖ్యంగా తమ పిల్లలకు ఉద్యోగం వస్తే లేదా తమ పిల్లలకు మంచి కాలేజీలో సీటు వచ్చినా.. విదేశాలలో ఉన్నత చదువులకు సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఆ పిల్లల ఎత్తు.. బరువు ఉన్న బెల్లాన్ని సమర్పిస్తారమని భక్తులే స్వయంగా చెబుతున్నారు.
విప్పసారా కూడా... అప్పట్లో ఆదివాసీలు సమ్మక్క,సారలక్కకు బెల్లంతో పాటు విప్పసారాను కూడా సమర్పించేవారట. అయితే ఇది చాలా సాంప్రదాయమట. కొంత సారాను అమ్మకు సమర్పించి.. మిగిలింది వారు సేవించేవారట. విప్పసారా అంటే విప్ప పువ్వుతో స్వయంగా తయారు చేసిన ద్రవాన్ని సమర్పించేవారట.
మొక్కుల్లో మార్పులు.. మన తెలుగు రాష్ట్రాల్లో జాతర అంటే మద్యం, మాంసం అనేది చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవ్వరైనా కోళ్లను, గొర్రెలను, మేకలతో తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో వీటితో పాటు విప్పసారాలోనూ మార్పు వచ్చింది. ఇతర రకాల మద్యం సేవించి.. మద్యాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారట.
మేడారం జాతర ఎప్పుడు? జాతర ప్రత్యేకతలేంటి? ఈ మేడారం జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తురాళ్లు అందరూ హఠాత్తుగా దేవతలయిపోతారంట. వీరంతా కలిసి ఇతర లోకంలోకి వెళతారంట.. అదంతా మరో భక్తి లోకం లాంటిదట.. అక్కడ తమలో తాము దాచుకున్న భావాలు, ఆందోళనలు, సలహాలు, సూచనలు, కోపం, ప్రేమ వంటివి బయటికి తీసుకొస్తారట.. ఫిబ్రవరి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఈ జాతర సంబురాలు జరగనున్నాయి.
మేడారం జాతరలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? మామూలుగా మనలో చాలా మంది దేవుళ్లందరికీ అనేక రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటాయి. అయితే అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీల ఆచారాలు మాత్రం మనందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో సమ్మక్క, సారలక్కకు భక్తులందరూ బెల్లాన్ని బంగారంగా భావించి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.
సాధారణంగా ఏ ప్రాంతంలో అయినా సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం మేడారం సమ్మక్క సారక్కల మహా జాతర మాత్రం రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది జాతర అంటే కోడిని లేదా మేక లేదా గొర్రె వంటి వాటిని బలి ఇవ్వడం. కొండకోనల నడుమ కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో కలిసి మందు, విందు, చిందు... అంతకుముందు జంపన్న వాగులో స్నానం చేసి.. అమ్మలకు బెల్లం సమర్పించడం వంటివి చేసి తిరుగు పయనం అవుతారు.అయితే ఈ మేడారం జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తురాళ్లు అందరూ హఠాత్తుగా దేవతలయిపోతారంట. వీరంతా కలిసి ఇతర లోకంలోకి వెళతారంట.. అదంతా మరో భక్తి లోకం లాంటిదట..అక్కడ తమలో తాము దాచుకున్న భావాలు, ఆందోళనలు, సలహాలు, సూచనలు, కోపం, ప్రేమ వంటివి బయటికి తీసుకొస్తారట.. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తేదీ నుండి నాలుగురోజుల పాటు అంటే ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరగనున్న మేడారం జాతర సందర్భంగా సమ్మక్క, సారక్కల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ స్టోరీని పూర్తిగా చూడండి...
దేవతలను ఆవాహన చేసుకుని.. మహిళల ఆందోళనలు వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి. అందుకే ఈ జాతర సమయంలో వారు దేవతల్ని ఆవాహన చేసుకుని.. తామే దేవతలుగా మారి ఆ ఉద్వేగాలన్నింటిని ఓ అలౌకిక స్థితిలో బయటకు కక్కేందుకు ప్రయత్నిస్తారట.
జాతర అంటే.. మామూలుగా జాతర అంటే గద్దెలు, అమ్మవార్లు మాత్రమే కాదని మనందరం గుర్తుంచుకోవాలి. జాతర అంటే కుటుంబ సమేతంగా కలిసి, కష్టసుఖాలను పంచుకుంటూ బయలుదేరే ఒక ఉద్వేగ ప్రదర్శన వంటిదే ఈ నాలుగు రోజుల ఉత్సవం అని అందరూ గ్రహించాలి.
హంగులు వద్దండోయ్.. మనలో చాలా మంది ఈ మధ్యన ఏదైనా వేడుక లేదా జాతర వంటి కార్యక్రమాలొస్తే చాలు హంగులు, ఆర్భాటాలు ప్రదర్శించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అచ్చం బతుకమ్మల్లాగే గుడారం నుండి మేడారం రూపాన్ని మార్చేస్తున్నారు. దీంతో ఈ జాతర వైభవం తగ్గిపోతుందని అందరూ తెలుసుకోవాలి
విగ్రహాలు లేకపోవడం.. సాధారణంగా ఏ గుడి అయినా.. ఏ జాతర అయినా ఎక్కడైనా సరే ఏదో ఒక దేవుడి లేదా దేవత విగ్రహం కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ మేడారం జాతరలో మాత్రం ఎలాంటి విగ్రహాలు ఉండవు.
నాలుగు రోజుల ఉత్సవం.. ఈ మేడారం జాతర ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభమవ్వనుంది. ఈ జాతర 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. తొలి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను పూజారులు తీసుకుని జంపన్న వాగు నుండి దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.
రెండో రోజు.. సమ్మక్కను గద్దె మీదకు చేరుస్తారు. సమ్మక్కను కూడా చిలకలగుట్ట మీద నుండి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ తతంగం చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సరిగ్గా ఈ సమయంలోనే కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క ఆగమనంతో అందరూ పులకరించిపోతారు. ఈ సమయంలోనే అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరుపుతారు.
మూడో రోజు.. గద్దెలపై సమ్మక్క, సారలమ్మలు కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలోనే భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకుంటారు.
చివరి రోజు.. అయిన చివరి రోజున దేవతల వన ప్రవేశం ఉంటుంది. ఈ సమయంలో ఆ వనమంతా జనసంద్రంగా మారిపోతుంది. ఈ సమయంలో అమ్మవార్ల ఆగమనంతో భక్తులు పూనకాలతో, శివభక్తుల చిందులతో అక్కడ అంతా కమణీయమైన రమణీయమైన వాతావరణం ఏర్పడుతుంది.