MEDARAM JATHARA - 2024

MEDARAM JATARA 2024 DAYS

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం గ్రామము, తాడ్వాయి మండలము, ములుగు జిల్లా,

వరంగల్ కేంద్రముగా ఈశాన్య దిశలో 104 కి.మీ. దూరములో గలదు.ఈ జాతర ప్రతి రెండు సంవత్సరములకు ఒక పర్యాయము మాఘమాసములో వచ్చు పౌర్ణమికి ముందు బుధ, గురువారములలో జాతర మహా వైభవోపేతముగా జరుపబడును.

ఈ జాతరకు సుమారు ఒక కోటి మంది భక్తులు తెలంగాణ రాష్ట్రం నుండియే గాక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రముల నుండి వచ్చి అమ్మవార్లను దర్శించి తరించుచున్నారు. ఈ జాతర 2023 సంవత్సరము ఫిబ్రవరి మాసము (మాఘమాసము)లో జరుగును. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వము వారిచే స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించబడినది.

ఫిబ్రవరి 21-02-2024 నుండి 24-02-2024 వరకు మేడారం జాతర.

తేది.21న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలకు తీసుకొస్తారు.

తేది.22న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకొస్తారు.

తేది.23న సమ్మక్క - సారలమ్మలకు ప్రజలు మొక్కులు చెల్లిస్తారు.

తేది.24న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం - 2024 జాతర

తేదీల ప్రకటన:

తేది:14-02-2024 మాఘ శుద్ధ పంచమి బుధవారం-మండమెలగడం మరియు గుడి శుద్ధీకర

తేది: 21-02-2024 :- మాఘ శుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గుడి మెలగడం,మరియు శ్రీ సారలమ్మ దేవత మరియు శ్రీ గోవింద రాజుల దేవుడు మరియు

శ్రీ పగిడిద్ద రాజుల దేవుడు సాయంత్రం 06.00 గంటలకు వారి వారి గద్దెల మీదకు చేరుకొను

తేది: 22-02-2024 :- మాఘ శుద్ధ త్రయోదశి గురువారం ఉదయం 08.00 గంటలకు వనం గద్దె మీదకు వచ్చుట,సాయంత్రం 06-00 గంటలకు శ్రీ సమ్మక్క దేవత గద్దె మీదకు చేరుకొనుట

తేది: 23 - 02 - 2024 - మాఘ శుద్ధ చతుర్దశి శుక్రవారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల

మరియు శ్రీ గోవింద రాజుల, శ్రీ పగిడిద్దరాజుల దేవుళ్ళకు భక్తులు మొక్కులు చెల్లించుట.

తేది: 24 -02 - 2024 - మాఘ శుద్ధ పౌర్ణమి

శనివారం - శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు మరియు శ్రీ గోవింద రాజులు, శ్రీ పగిడిద్ద రాజు దేవుళ్ళు వనప్రవేశం చేయుట.

తేది: 28-02-2024 - మాఘ శుద్ధ బహుళ పంచమి బుధవారం - తిరుగువారం పండగ.

వైద్య, ఆరోగ్య, విద్యుత్ మరియు నీటి సౌకర్యములు చేయడమైనది. ఆర్.టి.సి.చే ప్రత్యేక బస్సులు హన్మకొండ నుండి మరియు అన్ని డిపోల నుండి జాతరా వరకు నడుపబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అమ్మవార్లను దర్శించి సేవించి ఆశీస్సులు పొందగలరు. కరోనా ఒమెక్రన్ ఉదృతి పెరగడంతో ముందుగానే భక్తులు మేడారానికి వచ్చి తమ మొక్కులను సమర్పించు కుంటున్నారు.

సమ్మక్క సారక్క తల్లుల గద్దేల దగ్గరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు మరియు శాని టైజర్లు సామాజిక దూరం పాటించాలని అదేవిధంగా గద్దేల ప్రాంగణంలో మరియు మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శాని టైజీoగ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.

- సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ కుమార్